ఏపీ కరోనా అప్ డేట్: 2,618 కొత్త కేసులు, 16 మరణాలు

  • గత 24 గంటల్లో 88,780 కరోనా టెస్టులు
  • తాజాగా 3,509 మందికి కరోనా నయం
  • ఇంకా 23,668 మందికి చికిత్స
ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 88,780 కరోనా పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 2,618 పాజిటివ్ కేసులు గుర్తించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 423 కేసులు రాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 40 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో కరోనాతో 16 మంది మృతి చెందారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 6,706కి పెరిగింది. తాజాగా రాష్ట్రంలో 3,509 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఇప్పటివరకు ఏపీలో 8,25,966 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,95,592 మంది కరోనా విముక్తులయ్యారు. ఇంకా 23,668 మందికి చికిత్స కొనసాగుతోంది. మొత్తమ్మీద రాష్ట్రంలో మునుపటి ఉద్ధృతి లేదన్నది ఇటీవలి గణాంకాలు చెబుతున్నాయి.

Corona Virus
Andhra Pradesh
Positive Cases
Deaths
COVID19

More Telugu News